Bharat Bhushan: తెలుగు ఫిలిం ఛాంబర్ కు కొత్త అధ్యక్షుడు!

Bharat Bhushan elected as Telugu Film Chamber new president
  • ముగిసిన దిల్ రాజు పదవీకాలం
  • నేడు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి ఎన్నికలు
  • ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నిక
  • ఉపాధ్యక్షుడిగా నిర్మాత అశోక్ కుమార్ ఎన్నిక
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ సీసీ) అధ్యక్షుడిగా దిల్ రాజు పదవీకాలం ముగియడంతో నేడు (జులై 28) ఎన్నికలు నిర్వహించారు. నిర్మాతలు, స్టూడియోల యజమానులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

విశాఖకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ భూషణ్ తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈసారి ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి డిస్ట్రిబ్యూటర్లు పోటీలో నిలిచారు. భరత్ భూషణ్, ఠాగూర్ మధు (నెల్లూరు) పోటీపడగా, భరత్ భూషణ్ నే విజయం వరించింది. భరత్ భూషణ్ కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు వచ్చాయి. 

ఇక, తెలుగు ఫిలిం చాంబర్ ఉపాధ్యక్ష పదవికి కూడా నేడు ఎన్నికలు నిర్వహించగా... నిర్మాత అశోక్ కుమార్ గెలిచారు. ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి మధ్య పోటీ జరిగింది. అశోక్ కుమార్ కు 28 ఓట్లు, వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు లభించాయి.
Bharat Bhushan
President
TFCC
Tollywood

More Telugu News