KTR: కేంద్ర వార్షిక బడ్జెట్ పై కేటీఆర్ వ్యంగ్యం

KTR satires on Union budget 2024
ఎన్డీయే 3.0 ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపుల పట్ల మీ అంచనాలు ఏమిటి? అని ఈ ఉదయం ఓ జర్నలిస్టు తనను అడిగాడని కేటీఆర్ వెల్లడించారు. అయితే "గత పదేళ్లుగా తెలంగాణకు ఏమిస్తున్నారో, ఈసారి కూడా అదే ఇస్తారు... పెద్ద గుండు సున్నా" అని ఆ జర్నలిస్టుకు బదులిచ్చానని వివరించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
KTR
Union Budget-2024
Telangana
BRS
NDA

More Telugu News