Lella Appi Reddy: శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి

YSRCP MLC Lella Appi Reddy appointed as Leader of opposition in Legislative Council

  • నిన్నటి నుంచే అమల్లోకి వచ్చిన అప్పిరెడ్డి నియామకం
  • అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పేరిట నోటిఫికేషన్
  • అసెంబ్లీలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటున్న జగన్

ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ పేరిట ఈరోజు నోటిఫికేషన్ విడుదలయింది. లేళ్ల అప్పిరెడ్డి నియామకం నిన్నటి నుంచే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ఈ లేఖపై స్పీకర్ ఇంకా తన నిర్ణయాన్ని వెలువరించలేదు.

Lella Appi Reddy
YSRCP
AP Legislative Council
Opposition Leader
  • Loading...

More Telugu News