Kishan Reddy: ఎన్నికల్లో ఓడిపోయి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో మొదటిసారి చూస్తున్నాం: కిషన్ రెడ్డి

Kishan Reddy throw pot shots on Congress and BRS
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కిషన్ రెడ్డి విమర్శలు
  • గత ఎన్నికల్లో బీజేపీపై తప్పుడు ప్రచారాలు, కుట్రలు చేశారని ఆగ్రహం
  • ఆ రెండు పార్టీల వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పు లేదని వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో మొదటిసారి చూస్తున్నామని ఎద్దేవా చేశారు. 

గత ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు, కుట్రలు చేశారని... బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పులేదని ధ్వజమెత్తారు. ప్రజల తీర్పుకు విరుద్ధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. 

గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుంటోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు మజ్లిస్ తో స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని ఆరోపించారు.
Kishan Reddy
BJP
Congress
BRS
Telangana

More Telugu News