Nalini: నా రెండు దరఖాస్తులు చెత్త బుట్టలోకి వెళ్లాయేమోనని డౌట్ వస్తోంది: మాజీ డీఎస్పీ నళిని

Former DSP Nalini wrote interesting post in social media

  • గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని
  • కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, నళిని అంశం ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి
  • కానీ ఇప్పుడు తన గురించి చప్పుడు చేయడంలేదంటున్న నళిని

గతంలో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేయడం ద్వారా వార్తల్లోకెక్కిన నళిని... తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు తమ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందని, నళిని  కావాలనుకుంటే  డీఎస్పీ ఉద్యోగంలో తిరిగి చేరొచ్చని, లేకపోతే ప్రభుత్వంలో మరేదైనా ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో, నళిని పెట్టిన తాజా పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. 

"సీఎం సార్ కొలువు చేపట్టగానే నన్ను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడేమో దాని గురించి ఏమీ మాట్లాడంలేదు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగాయి. కానీ నా ఊసే ఎత్తకపోవడం ఆశ్చర్యం కలిగించింది. నేను ప్రభుత్వానికి చేసుకున్న రెండు దరఖాస్తులు బల్లపై ఉన్నాయో, చెత్తబుట్టలోకి పోయాయో అనే డౌట్ వస్తోంది. ఇప్పుడే చీఫ్ సీఆర్ఓను, ఓఎస్డీని ఈ విషయమై సంప్రదించాను. ఇదే విషయమై లేఖ కూడా రాశాను. 

చిన్నప్పుడు అడుక్కునేవాళ్లు ఇంటి ముందుకు వస్తే ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి వెళ్లవయ్యా అని మెల్లగా చెప్పేవాళ్లం. కనీసం ఆ పాటి మర్యాద అయినా నాకు ఇస్తారేమో చూడాలి. అందుకే నేను ఇన్నాళ్లు ఎవరినీ కలవలేదు. 

ఉద్యమం చేసేటప్పుడే నాకు చాలా విషయాలు అర్థం అయ్యాయి. కేవలం ఒక నెలలోనే నా పిటిషన్ పై ఎంక్వైరీ పూర్తి చేస్తారనుకున్నాను... కానీ ఏడు నెలలు కావస్తోంది. అందుకే రిమైండర్ లేఖ రాయాల్సి వచ్చింది. ఈ పోస్టు కూడా దాని గురించే. 

సెక్రటేరియట్ చుట్టూ తిరిగే ఓపిక, సమయం నాకు లేవని ఆ రోజే నేను రేవంతన్నకు చెప్పాను" అంటూ నళిని తన పోస్టులో వివరించారు.

Nalini
DSP
Telangana movement
Revanth Reddy
Congress
Telangana
  • Loading...

More Telugu News