Bike Stunt: ఇన్ స్టా రీల్స్ కోసం బైక్ స్టంట్స్.. హయత్ నగర్ లో యువకుడి మృతి.. వీడియో ఇదిగో!

Two youngsters Doing Stunt on Busy Road In HayatNagar Bike Sliped One died on spot

  • ప్రాణాపాయ స్థితిలో మరో యువకుడు
  • వర్షంలో స్టంట్స్ చేస్తుండగా స్లిప్ అయిన బైక్
  • కిందపడ్డ యువకులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత చేస్తున్న స్టంట్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో ఇన్ స్టా రీల్స్ కోసం బైక్ స్టంట్స్ చేస్తూ ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. వర్షంలో స్టంట్స్ చేస్తుండగా బైక్ స్లిప్ కావడంతో ఇద్దరూ కిందపడ్డారు. దీంతో తీవ్ర గాయాలపాలై ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ పైనుంచి పడ్డ యువకులను స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఓ యువకుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు.

తీవ్ర గాయాలపాలైన మరో యువకుడిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. హయత్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్ద అంబర్‌పేట్ సమీపంలో ఇద్దరు యువకులు బైక్‌తో స్టంట్ చేశారు. సింగిల్ వీల్‌పై బైక్‌ నడుపుతూ హల్‌చల్ చేశారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి కిందపడగా.. శివ అనే యువకుడు చనిపోయాడు. బైక్ నడిపిన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Bike Stunt
HayatNagar
Youngster Dead
Ranga Reddy District
Crime News
  • Loading...

More Telugu News