Free Journey: తెలంగాణ ఆర్టీసీ బస్సులో వెల్లుల్లి పొట్టు తీసుకుంటూ ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు... వీడియో వైరల్

Women peels garlic while free traveling in TSRTC bus


తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... తన హామీని నిలుపుకుంటూ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. తాజాగా, ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హన్మకొండ నుంచి సిద్ధిపేటకు వెళుతున్న బస్సులో కొందరు మహిళలు వెల్లుల్లిపాయల పొట్టు తీసుకుంటూ, హాయిగా ఉచిత ప్రయాణం చేస్తుండడం ఆ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.

Free Journey
Women
Garlic
Bus
TSRTC
Telangana
  • Loading...

More Telugu News