Bakka Jadson: ప్రస్తుత కాంగ్రెస్ పార్టీని చూస్తే జాలేస్తోంది: బక్క జడ్సన్

Jadson hot comments on CM Revanth Reddy

  • ముద్దాయిని తీసుకువచ్చి సీఎంగా చేశారని ఆరోపణ
  • 34 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్న తాను ఇప్పుడు లేనందుకు ఆనందంగా ఉందని వ్యాఖ్య
  • ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీని చంపేశారన్న జడ్సన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడ్సన్ మాట్లాడుతూ... ముద్దాయిని తీసుకువచ్చి ముఖ్యమంత్రిని చేశారని ఆరోపించారు. 

34 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాను ఈరోజు అదే పార్టీలో లేనందుకు సంతోషంగా ఉన్నానన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని కాదని, ఆ పార్టీ ఐడియాలజీ గ్రూప్ సభ్యుడిని అన్నారు. గాంధీ ఆశ్రమంలో చరఖా తిప్పడం నేర్చుకున్న గ్రూప్ తనది అన్నారు. నిత్యం అభివృద్ధి, దేశం గురించి చెప్పే కాంగ్రెస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసేంత ఖర్మ పట్టిందని ఎద్దేవా చేశారు.

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీని చూసి తనకు జాలేస్తోందన్నారు. అలాంటి పార్టీలో ఈరోజు లేనందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీని చంపేశారన్నారు. ఇక జీవితకాలం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లవద్దని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పటికీ ఆ పార్టీలో ఉండి ఉంటే విలన్‌ను అయి ఉండేవాడినన్నారు.

Bakka Jadson
Telangana
Revanth Reddy
  • Loading...

More Telugu News