YouTuber Praneeth: మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు.. డ్రగ్స్ కేసు నమోదు

Police Files Drugs Case Against Youtuber Praneeth Hanumantu


యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. తండ్రీకుమార్తెల బంధంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ప్రణీత్‌పై ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తాజాగా, ఆయనపై డ్రగ్స్ కేసు కూడా నమోదైంది. ప్రణీత్ డ్రగ్స్ తీసుకోవడంతోపాటు గంజాయి తాగినట్టు పోలీసులు గుర్తించారు.

ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రణీత్‌పై 67బీ,  ఐటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. వీటికి అదనంగా తాజాగా 79, 294 బీఎన్ఎస్, ఎన్డీపీఎస్ చట్టాల కింద పలు సెక్షన్లను జత చేశారు. ప్రణీత్‌ను విచారించేందుకు మూడు రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

YouTuber Praneeth
Praneeth Hanumantu
Drugs Case
Cybercrime
  • Loading...

More Telugu News