Gautham Gambhir: కోచింగ్ సిబ్బంది కోసం గంభీర్ సూచించిన ఐదుగురిలో నలుగురిని తిరస్కరించిన బీసీసీఐ?

BCCI has rejected all of Gambhir suggestions barring Abhishek Nayar

  • ఒకరికి మాత్రమే కోచింగ్ సహాయక సిబ్బందిగా అవకాశం ఇచ్చినట్టు కథనాలు
  • సహాయక సిబ్బందిగా ఆర్ వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చాట్, జాంటీ రోడ్స్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను ప్రతిపాదించిన గంభీర్
  • అభిషేక్ నాయర్‌ విషయంలో మాత్రమే బీసీసీఐ సుముఖం!

భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరుని ప్రకటించి దాదాపు పది రోజులు కావొస్తోంది. అయితే సహాయక సిబ్బందిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. బీసీసీఐ పెద్దలతో పాటు గంభీర్ కూడా కోచింగ్ సిబ్బందిని అన్వేషించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో కోచింగ్ సిబ్బందిలో వివిధ పాత్రల కోసం గంభీర్ సూచించిన ఐదుగురు మాజీలలో నలుగురిని బీసీసీఐ తిరస్కరించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఆర్ వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చాట్, జాంటీ రోడ్స్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను గంభీర్ సూచించగా.. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్న అభిషేక్ నాయర్‌కు మాత్రమే బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు  తెలుస్తోంది.

అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ అభిషేక్ నాయర్‌‌ పట్ల బీసీసీఐ సుముఖంగా ఉన్నట్టు ‘ఎకనామిక్ టైమ్స్‌’ కథనం పేర్కొంది. అయితే మోర్నీ మోర్కెల్, వినయ్ కుమార్, బాలాజీ, జాంటీ రోడ్స్, ర్యాన్ టెన్ పట్ల బోర్డు ఆసక్తి చూపలేదని తెలిపింది. మాజీ కోచ్‌లు రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్‌లకు తమ కోచింగ్‌ స్టాఫ్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను బీసీసీఐ కల్పించిందని, అయితే గంభీర్‌ విషయంలో ఆ స్వేచ్ఛ ఇవ్వడం లేదని పేర్కొంది. 

బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్!
భారత జట్టు తదుపరి బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. భారత్‌కు ఆడిన అత్యుత్తమ బౌలర్లలో జహీర్ ఖాన్‌ ఒకడని, అతడికి అవకాశం ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా జహీర్ భారత్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కలిపి 309 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి మొత్తం 610 వికెట్లు తీశాడు. లక్ష్మీపతి బాలాజీ పేరు కూడా బీసీసీఐ దృష్టికి వచ్చినప్పటికీ జహీర్ ఖాన్‌వైపే మొగ్గుచూపుతోందని సమాచారం.

Gautham Gambhir
BCCI
Abhishek Nayar
Cricket
Team India
  • Loading...

More Telugu News