కవిత ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కవిత ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

Doctors on Kavithas health condition
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు అధికారులు ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్లారు. డిశ్చార్జ్ అయ్యాక ఆమెను నేరుగా తీహార్ జైలుకు తీసుకువెళ్లారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన కవిత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు.

మంగళవారం నాడు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. కవిత రెండు గంటల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. మనీలాండరింగ్ ఆరోపణలపై కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 11న సీబీఐ అధికారులు ఆమెను జైల్లోనే అదుపులోకి తీసుకున్నారు. కవిత నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారు.
Advertisement
K Kavitha
BRS
Delhi Liquor Scam

More Telugu News