Kodi Kathi Case: కోడికత్తి శ్రీను బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ

Supreme Court rejects Kodikathi Srinu bail cancelation petition

  • 2019లో జగన్ పై కోడికత్తితో దాడి
  • నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించిన ఎన్ఐఏ

గతంలో విశాఖ ఎయిర్ పోర్టులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కోడికత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి కూడా విదితమే. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. బెయిల్ రద్దు చేయలేమని స్పష్టం చేసింది. 2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై కోడికత్తితో దాడి జరిగింది. ఈ దాడి అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు పుట్టించింది.

Kodi Kathi Case
Srinivasa Rao
Bail
Supreme Court
NIA
Jagan
YSRCP
  • Loading...

More Telugu News