Attack On Trump: ట్రంప్ పై దాడి గురించి 4 నెలల ముందే చెప్పిన చర్చ్ పాస్టర్.. వైరల్ వీడియో!

Old viral video of Pastor predicting attack on Donald Trump gains attention

  • బుల్లెట్ చెవిని తాకడం కనిపించిందన్న పాస్టర్
  • ఓ ఇంటర్వ్యూలో పాస్టర్ చెప్పిన ప్రకారమే తాజా దాడి
  • ప్రస్తుతం వైరల్ గా మారిన నాటి ఇంటర్వ్యూ వీడియో

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడిని ఓ చర్చ్ పాస్టర్ ముందే ఊహించారు.. ట్రంప్ పై దాడి జరగడం తనకు కనిపించిందని నాలుగు నెలల కిందటే ఆయన చెప్పారు. దాడికి సంబంధించి తనకు కనిపించిన వివరాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఏడాది మార్చి 14న యూట్యూబ్ లో విడుదల చేసిన సదరు వీడియోలో పాస్టర్ చెప్పినట్లే తాజాగా దాడి జరిగింది. దీంతో నాటి ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంటర్వ్యూలో పాస్టర్ మాట్లాడుతూ.. ఓ ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పై హత్యాయత్యం జరుగుతుందని చెప్పారు. ఆ సంఘటన తన కళ్లముందు కనిపిస్తోందని, ఒక బుల్లెట్ ట్రంప్ శరీరానికి అత్యంత సమీపంలో నుంచి దూసుకెళ్లిందని వివరించారు. బుల్లెట్ చెవిని గాయపరచడంతో ట్రంప్ మోకాళ్లపై కూర్చుని దేవుడిని ప్రార్థించాడని తెలిపారు. ఆ తర్వాత ఎన్నికల్లో ట్రంప్ గెలిచి అధ్యక్ష పదవి చేపట్టడం చూస్తున్నానని పాస్టర్ చెప్పారు. ఈ వివరాలన్నీ ఈ ఏడాది మార్చిలోనే పాస్టర్ వెల్లడించారు. తాజా దాడి సరిగ్గా పాస్టర్ చెప్పినట్లే జరగడం గమనార్హం. కాగా, ఈసారి ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తాడని, అధ్యక్ష ఎన్నికల తర్వాత దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని కూడా సదరు పాస్టర్ వెల్లడించారు.

Attack On Trump
Fastor Pridiction
Viral Videos
winner Trump
Economic Crisis
  • Loading...

More Telugu News