Wedding called off: విందులో చేపలు, మాంసం పెట్టలేదని పెళ్లి రద్దు.. వరుడు షాకింగ్ నిర్ణయం

wedding called off marriage as fish and meat missing in meal in Uttarpradesh
  • వధువు కుటుంబ సభ్యులపై దాడి చేసిన వరుడు, అతడి బంధువులు
  • వివాహ వేదిక నుంచి వెళ్లిపోయిన పెళ్లి కొడుకు
  • రద్దయిన పెళ్లి.. ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన షాకింగ్ ఘటన
విందులో చేపలు, మాంసం పెట్టలేదన్న కారణంగా వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకున్న విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. వధువు ఇంట్లో జరగాల్సిన పెళ్లి కోసం ఆమె కుటుంబ సభ్యులు చక్కటి ఏర్పాట్లు చేశారు. పనీర్, పులావ్, రకరకాల కూరలతో భారీ స్థాయిలో విందు ఏర్పాట్లు చేశారు. పెద్ద మొత్తంలో కట్నం కూడా ముట్టచెప్పారు. అయితే విందులో చేపలు, మాంసం రెండూ లేకపోవడం వరుడి కుటుంబానికి రుచించలేదు. వధువు కుటుంబ సభ్యులు, బంధువుల పై గొడవకు దిగారు. నానా బూతులు తిడుతూ వధువు తరపు వారిని కొట్టారు. కర్రలతో సైతం దాడి చేశారు. పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి వరుడు అక్కడి నుంచి వెళ్లి పోయాడు. దీంతో పెళ్లి రద్దైంది. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్నం కూడా ముట్టజెప్పామని ఫిర్యాదు పేర్కొన్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా ఆనంద్ నగర్ గ్రామంలో గురువారం ఈ షాకింగ్ ఘటన జరిగింది. దినేష్ శర్మ కుమార్తె సుష్మను వివాహం చేసుకునేందుకు వరుడు అభిషేక్ శర్మ అతడి కుటుంబ సభ్యులు ఆనంద్ నగర్ గ్రామానికి చేరుకున్నారు. అయితే పెళ్లిలో మాంసాహారం లేదనే విషయం వరుడికి తెలియడంతో అతడు ఆగ్రహంతో రెచ్చిపోయాడు. అప్పటివరకు అంతా సవ్యంగానే జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా దండల మార్పిడి కూడా జరిగింది. కానీ నాన్ వెజ్ లేదనే కారణంతో పెళ్లి కొడుకు, అతడి కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు.

మాంసాహారం లేదంటూ పెళ్లి కొడుకు అభిషేక్ శర్మ, అతడి తండ్రి సురేంద్ర శర్మ, రాంప్రవేష్ శర్మ, రాజ్‌కుమార్ అనే వ్యక్తులతో పాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు వధువు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. గొడవ ముదరడంతో దాడికి  దిగారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వధువు తండ్రి పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

దాదాపు రూ.5 లక్షలు కట్నంగా ఇచ్చామని, కారు కొనేందుకు రూ.4.5 లక్షలు ఇచ్చామని, రెండు బంగారు ఉంగరాలు కూడా ఇచ్చారని దినేశ్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ కొట్లాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం, కొట్టుకోవడం, కుర్చీలు విసురుకోవడం కనిపించింది.
Wedding called off
Uttar Pradesh
Viral News
Off Beat News

More Telugu News