Andhra Pradesh: నృత్య ప్రదర్శనలో కోడి తల కొరికేసిన డ్యాన్సర్.. అనకాపల్లిలో కేసు నమోదు

Andhra Pradesh Police have filed a case against a dancer for killing a hen by biting off its head
  • పెటా ఇండియా ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు
  • ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారంటూ ఫిర్యాదు
  • డ్యాన్సర్‌తో పాటు నిర్వాహకులపైనా కేసు
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో ఆసక్తికరమైన ఘటన వెలుగుచూసింది. ఓ డ్యాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపెట్ట తలను కొరికివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

నృత్య ప్రదర్శనలో జనసందోహం ముందు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కోడి తలను తన పళ్లతో కొరికి చంపాడని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసు అధికారులను పెటా ఇండియా సంప్రదించింది. ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారని, వినోదం పేరిట ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ, జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం-1960లోని సంబంధిత సెక్షన్ కింద డ్యాన్సర్‌తో పాటు నిర్వాహకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Andhra Pradesh
dancer killed Hen
Crime News
Off beat News

More Telugu News