Raj Tarun: లావణ్యకు మద్దతుగా కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు

Karate Kalyani Reaction On Hero Raj Tarun and Lavanya Issue

  • రాజ్ తరుణ్ ను ఆమె ఇప్పటికీ కోరుకుంటోందన్న నటి
  • డబ్బులు డిమాండ్ చేసిందనడానికి ఆధారాల్లేవని కామెంట్
  • ఏదేమైనా ఈ కేసు వారి వ్యక్తిగతమైందని చెప్పిన కరాటే కల్యాణి

హీరో రాజ్‌ తరుణ్‌, లావణ్య ప్రేమాయణంపై ప్రముఖ నటి కరాటే కల్యాణి తాజాగా స్పందించారు. పోలీసుల దాకా వెళ్లిన ఈ వ్యవహారం పూర్తిగా వారిద్దరి వ్యక్తిగతమని చెప్పారు. ఇండస్ట్రీకి దీంతో సంబంధం లేదంటూనే లావణ్యకు మద్దతుగా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే లావణ్య ఇప్పటికీ రాజ్ తరుణ్‌ని కోరుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. కానీ రాజ్ తరుణ్ అందుకు అంగీకరించడం లేదని అనిపిస్తుందని వివరించారు. పోలీస్ కంప్లైంట్ వాపస్ తీసుకోవడానికి లావణ్య డబ్బులు తీసుకుందనే ఆరోపణలు నిజం కాకపోవచ్చని, అదే నిజమైతే ఆధారాలు బయటపెట్టేవారని తెలిపారు. తినడానికి ఇరవై వేలు ఇవ్వాలని అడుగుతుందంటే లావణ్య ఏ పరిస్థితుల్లో ఉందనేది అర్థం చేసుకోవచ్చని కరాటే కల్యాణి అన్నారు.

లావణ్య, రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం పోలీసుల దాకా చేరినప్పటికీ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు స్పందించకపోవడంపై కరాటే కల్యాణి తప్పుబట్టారు. పదేళ్లుగా కలిసి ఉంటున్న వీరిద్దరి ప్రేమ వ్యవహారం అందరికీ తెలుసని, సోషల్ మీడియాలో కూడా ఫొటోలు ఉన్నాయని గుర్తుచేశారు. అయినా కూడా రాజ్ తరుణ్ పేరెంట్స్ స్పందించడంలేదంటే లావణ్య చెప్పినవన్నీ నిజాలేనని భావించాల్సి ఉంటుందన్నారు.

చట్టాల్లో మార్పు రావాలి..
అమ్మాయి అయినా, అబ్బాయి అయినా.. నేరానికి పాల్పడ్డాక కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనని కరాటే కల్యాణి స్పష్టం చేశారు. అయితే, చట్టాల్లోని లొసుగులను అడ్డంపెట్టుకుని కొంతమంది తప్పించుకుంటున్నారని ఆరోపించారు. నేరం చేసినా సరే తప్పించుకోవచ్చని భావించే వారికి భయం కలిగేలా చట్టాలలో మార్పు చేయాల్సిన అవసరం ఉందని, కఠిన శిక్ష తప్పదనే హెచ్చరిక జనంలోకి వెళ్లాలని కల్యాణి చెప్పుకొచ్చారు.

Raj Tarun
Lavanya
Police case
Karate Kalyani
Raj Tarun Love
  • Loading...

More Telugu News