Vallabhaneni Vamsi: ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్టు?

AP Police Ground Prepared To Arrest Vallabhaneni Vamsi

  • గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిపై కేసు
  • వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
  • టీడీపీ నేతల ఫిర్యాదుతో వైసీపీ నాయకుల పరార్

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసుల్లో చలనం వస్తోంది. అప్పట్లో కేసుల దర్యాఫ్తును పక్కకు పెట్టిన పోలీసులు తాజాగా ఏపీలో ప్రభుత్వం మారడంతో నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పైనుంచి ఒత్తిడి వల్ల పక్కన పెట్టిన కేసుల దుమ్ముదులుపుతున్నారు. ఈ క్రమంలోనే గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి అధికార పార్టీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోర్టులో పోలీసుల తరఫు న్యాయవాది ఇదే విషయాన్ని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ దాడికి కారణమని విన్నవించారు.

టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్‌విత్‌ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో కొంతమంది నిందితులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో ఏ క్షణంలోనైనా మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Vallabhaneni Vamsi
Andhra Pradesh
YSRCP
Former Mla Arrest
TDP
Gannavaram TDP
Police Case
  • Loading...

More Telugu News