TDP Office: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు... వైసీపీ నేతల పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

AP High Court adjourns hearing on YCP leaders petitions
  • వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి
  • ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలు
  • నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం 
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్ ల పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అటు, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా వాయిదా పడింది.
TDP Office
Attack
YSRCP
AP High Court

More Telugu News