Moong Sprouts: రోజంతా అలసట అనిపిస్తోందా..? బ్రేక్ ఫాస్ట్ గా మొలకెత్తిన పెసలు తింటే సరి!

Eat A Cup Of Moong Sprouts To Get Tons Of Health Benefits

  • రోగనిరోధక శక్తి పెరుగుతుందంటున్న నిపుణులు
  • ఎసిడిటీని దూరం చేయడంతో పాటు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుందట
  • మధుమేహ బాధితులకు దివ్యౌషధం
  • గుప్పెడు మొలకెత్తిన పెసర్లతో గుండె పదిలం

మొలకెత్తిన పెసర్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. రోజూ ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తింటే అలసటను దూరం చేసుకోవచ్చని, గుండెను పదిలంగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. అంతేకాదు.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు. మొలకెత్తిన పెసర్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.

రోజువారీగా మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సహా ఎన్నెన్నో ఈ మొలకెత్తిన పెసర్లను తినడం ద్వారా సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ అలసటను పోగొట్టేందుకు, మెరుగైన నిద్రకు తోడ్పడతాయని చెప్పారు. మొలకెత్తిన పెసర్లను బ్రేక్‌ఫాస్ట్‌గా తినడం ద్వారా జీర్ణవ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చంటున్నారు. ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుందని, తద్వారా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చని తెలిపారు.

రక్త ప్రసరణ మెరుగుపరిచేందుకు తోడ్పడి, రక్తం గడ్డకట్టే ముప్పును తప్పించుకునేందుకు దోహదం చేస్తాయట. మొలకెత్తిన పెసర్లలోని ఫైబర్ కంటెంట్ ఎసిడిటీ, కడుపు నొప్పి, పుల్లని త్రేన్పుల వంటి జీర్ణకోశ సమస్యలను దూరం చేస్తాయని వివరించారు. చర్మ సంరక్షణకు తోడ్పడి వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవని తెలిపారు. కంటిచూపు కూడా పెరుగుతుందన్నారు.

మధుమేహ బాధితులకు దివ్యౌషధంగా పనిచేస్తాయని, రక్తంలో చక్కెర స్థాయులను సమతుల్యం చేయగల సామర్థ్యం మొలకెత్తిన పెసర్లకు ఉందని నిపుణులు వెల్లడించారు. రోజూ గుప్పెడు గింజలు తింటే గుండె పదిలంగా ఉంటుందని, శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుందని వివరించారు. సంతానోత్పత్తికి, గర్భిణీలకు మొలకెత్తిన పెసర్లు ఆరోగ్యాన్నిస్తాయని, అధిక బరువును వదిలించుకోవడానికి తోడ్పడతాయని తెలిపారు.

Moong Sprouts
Health benefits
Diabetics
Heart Health
Breakfast
  • Loading...

More Telugu News