Revanth Reddy: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy on Kalvakurthy lift irrigation
  • కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచన
  • క్షేత్రస్థాయిలో పరిశీలించి యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలన్న రేవంత్ రెడ్డి
  • గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు సిద్ధమని వెల్లడి
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌పై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్‌లో ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి నెలా ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలన్నారు.
Revanth Reddy
Congress
Mahabubabad District

More Telugu News