Narendra Modi: రష్యాకు నేను ఒక్కడినే రాలేదు: ప్రధాని నరేంద్ర మోదీ

Modi speech for Indian diaspora in Moscow

  • రష్యాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ
  • మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగం
  • 140 కోట్ల మంది ప్రేమను మోసుకొచ్చానని, భారతదేశ మట్టివాసన మోసుకొచ్చానని వెల్లడి

భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యాకు తాను ఒక్కడినే రాలేదని... 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను మోసుకొచ్చానని, భారతదేశ మట్టి వాసనను మోసుకొచ్చానని భావోద్వేగభరితంగా చెప్పారు. 

ఇటీవలే తాను మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని, ఇక నుంచి మూడు రెట్ల వేగంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. భారత్ ను ఇప్పటికే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని, దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడమే తమ ముందున్న లక్ష్యమని మోదీ ఉద్ఘాటించారు. 

భారత్ ఇప్పుడు ప్రపంచంలో ప్రముఖ స్థానం పొందిందని, మనం సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోందని వ్యాఖ్యానించారు. మరే దేశానికి సాధ్యం కాని రీతిలో చంద్రయాన్ ప్రయోగాన్ని విజయవంతం చేశామని, డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉందని వివరించారు.

Narendra Modi
Indian Diapsora
Moscow
Russia
India
  • Loading...

More Telugu News