Smriti Mandhana: బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తో తన బంధాన్ని బహిర్గతం చేసిన స్మృతి మంధన

Smriti Mandhana confirms her relationship with Palash Mucchal
  • గత ఐదేళ్లుగా ప్రేమలో స్మతి మంధన
  • తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ తో కలిసి కేక్ కట్ చేసిన స్మృతి
  • ఫొటోలు పంచుకున్న పలాశ్... స్పందించిన స్మృతి
భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాటింగ్ స్టార్ స్మృతి మంధన ప్రేమలో పడిందని చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ కు చెందిన పలాశ్ ముచ్చల్ అనే మ్యూజిక్ డైరెక్టర్ తో రిలేషన్ షిప్ లో ఉందని జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు స్మృతి మంధన తమ ప్రేమ వ్యవహారాన్ని బహిర్గతం చేసింది. 

ఐదేళ్ల తమ ప్రేమకు గుర్తుగా స్మృతి, పలాశ్ ఓ స్పెషల్ కేక్ కట్ చేశారు. ఈ ఫొటోలను పలాశ్ ముచ్చల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, స్మృతి మంధన కూడా స్పందించడంతో వారిద్దరి బంధం అఫిషియల్ అయింది. 

పలాశ్ ముచ్చల్ వయసు 29 ఏళ్లు కాగా, స్మృతి వయసు 27 సంవత్సరాలు. స్మృతి మంధన టీమిండియా మహిళల జట్టులో ఎంతటి కీలకమైన ప్లేయరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఇక, పలాశ్ గురించి చెప్పాల్సి వస్తే... పలు మ్యూజిక్ ఆల్బంలకు  సంగీతం అందించాడు. రిక్షా అనే వెబ్ సిరీస్ కు, అర్ధ్ అనే బాలీవుడ్  సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. అంతేకాదు, అభిషేక్ బచ్చన్, దీపిక పదుకొణే వంటి స్టార్లతో కలిసి ఖేలే హమ్ జీ జాన్ సే అనే  సినిమాలోనూ నటించాడు. పలాశ్ సోదరి పలక్ ముచ్చల్ బాలీవుడ్ గాయని.
Smriti Mandhana
Palash Mucchal
Relationship
Team India
Bollywood

More Telugu News