Jagannath Rath Yatra: నేడు పూరీ జగన్నాథుడి రథయాత్ర.. 1971 తర్వాత తొలిసారి ఒకే రోజు మూడు యాత్రలు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథుడి రథయాత్ర నేడు జరగనుంది. నేటి రథయాత్రకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. 1971 తర్వాత తొలిసారి ఒకేరోజు జగన్నాథ నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహించనున్నారు. జగన్నాథ, బలభద్రస్వామి, సుభద్ర శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనాన్ని వీడి పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి యాత్రగా చేరుకుంటారు.
ఈ మూడు వేడుకలు నేడు ఒకేసారి జరగనుండడంతో నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్ రథాలు నేటి సాయంత్రానికి అమ్మవారి ఆలయానికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. స్వామి సేవలు పూర్తయ్యే వరకు రథాలను మార్గమధ్యంలో నిలిపివేస్తారు. రేపు (సోమవారం) మళ్లీ రథాలను లాగుతారు.
ఈ రథయాత్రకు మరో ప్రత్యేకత కూడా ఉంది. పూరీజగన్నాథుడి రథయాత్రలో తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటున్నారు. గతంలో రాష్ట్రపతులు ఎవరూ ఈ యాత్రకు హాజరు కాలేదు. గవర్నర్ రఘుబర్‌దాస్‌తో కలిసి సుభద్రమ్మ రథాన్ని రాష్ట్రపతి లాగుతారు.
అలాగే, ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు కూడా రథోత్సవంలో పాల్గొంటారు. రెండు రోజులపాటు జరిగే ఈ రథోత్సవంలో దాదాపు 15 లక్షల మంది వరకు భక్తులు పాల్గొంటారని అంచనా. ఈ నేపథ్యంలో పూరిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.