Alluri Sitaramaraju district: భర్తకు మరో పెళ్లి చేసిన అతని భార్యలు!

two wives arrange husbands marriage with another woman


అప్పటికే అతడికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ తాజాగా అతడి భార్యలిద్దరూ కలిసి భర్తకు మూడో వివాహం చేశారు. పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తూ దగ్గరుండి మరీ వివాహం జరిపించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కించూరు గ్రామానికి చెందిన సాగేని పండన్నకు 2000లో పార్వతమ్మతో వివాహం జరిగింది. కానీ ఆమెకు సంతానం కలగలేదు. 2005లో అప్పలమ్మను వివాహం చేసుకున్నాడు. 2007లో వీరికి ఓ అబ్బాయి పుట్టాడు. ఆ తరువాత ఆమెకూ సంతానం కలగలేదు. ఈ క్రమంలో ఇద్దరు భార్యల అనుమతితో మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. గత నెల 25న జరిగిన మూడో పెళ్లికి భార్యలే పెద్దలుగా వ్యవహరించి, పెళ్లి కార్డులు ప్రింట్ చేయించి, బ్యానర్లు వేయించారు. సంతానం కోసం తన భార్యలు త్యాగం చేశారంటూ పండన్న తెలిపాడు.

Alluri Sitaramaraju district
Andhra Pradesh
  • Loading...

More Telugu News