Cab Driver: క్యాబ్ డ్రైవర్ రోజువారీ సంపాదన విని షాక్ తిన్న ప్యాసింజర్.. వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్

a cab driver revealed that he earns Rs 3000 to Rs 4000 per day

  • రోజుకు రూ.3000 నుంచి రూ.4000 సంపాదిస్తున్న బెంగళూరు క్యాబ్ డ్రైవర్
  • విషయం తెలిసి ఆశ్చర్యపోయిన ఓ ప్యాసింజర్
  • సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆసక్తికరంగా స్పందిస్తున్న నెటిజన్లు

ఓ క్యాబ్ డ్రైవర్ రోజువారీ సంపాదన తెలుసుకొని ఓ ప్యాసింజర్ ఆశ్చర్యపోయాడు. బెంగుళూరు మహానగరంలో ఒక క్యాబ్ డ్రైవర్ రోజుకు రూ.3000 నుంచి రూ.4000 వరకు సంపాదిస్తాడని గ్రహించి షాక్ తిన్నాడు. తాను రోజుకు రూ.3,000 నుంచి రూ.4,000 సంపాదిస్తున్నట్టు డ్రైవర్ చెప్పాడని, అంతేకాదు క్యాబ్‌ను రెంటల్ ఇవ్వడంతో అదనపు ఆదాయాన్ని పొందుతున్నానంటూ అతడు చెప్పాడంటూ వివరించాడు.

‘‘ ఈ రోజు నేను ఒక ఫంక్షన్ నుంచి తిరిగి వస్తూ ఒక క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ డ్రైవర్‌తో కబుర్లు చెబుతూ అతని సంపాదన గురించి అడిగాను. రోజుకు సుమారు రూ.3000 నుంచి రూ.4000 సంపాదిస్తున్నానని చెప్పాడు. నేను షాక్ అయ్యాను. రోజుకు 3000 సంపాదిస్తే నెలలో 25 రోజులు పని చేసినా అతడి ఆదాయం నెలకు రూ.75,000 అవుతుంది. డీజిల్ ఖర్చులు తీసేసినా అతడి ఆదాయం బాగానే ఉందని చెప్పాడు. ఒక ఓలా క్యాబ్ రెంటల్‌కి ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నట్టు చెప్పాడు’’ అంటూ ‘రెడ్డిట్‘లో ఓ యూజర్ రాసుకొచ్చాడు.

కొన్ని రోజులక్రితం షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్యాబ్ డ్రైవర్ ఆదాయాలపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇది నిజమేనని, తమకు తెలిసినవారు కొందరు ఇదే రేంజ్‌లో సంపాదిస్తున్నారని కొందరు పేర్కొన్నారు.  డీజిల్ ఖర్చులు, ఈఎంఐలు మినహాయించినప్పటికీ పెద్ద మొత్తంలో మిగుల్చుకునేవారు ఉన్నారని ప్రస్తావించారు. కొందరు డ్రైవర్లు మంచి ఇళ్లు కట్టించుకున్నారని, తనకు తెలిసిన ఓ క్యాబ్ డ్రైవర్ రెండు ఎకరాల పొలం కూడా కొన్నాడని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

అందులో ఆశ్చర్యం ఏముంది? కష్టపడుతున్నాడు కాబట్టి సంపాదిస్తున్నాడని ఓ యూజర్ అభిప్రాయపడ్డాడు. చాలా కష్టపడుతుంటారని, రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలతో ఒత్తిడి ఉంటుందని, చాలా అలసిపోతుంటారని పేర్కొన్నాడు.

Cab Driver
Earns
Bengaluru
Off Beat News
  • Loading...

More Telugu News