Congress: నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియకుండానే కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy lashes out at KCR for charlagudem project

  • చర్లగూడెం ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
  • ప్రాజెక్టును ప్రారంభించి పదేళ్లు పూర్తయిందని ఆగ్రహం
  • బీఆర్ఎస్ తొందరపాటు చర్యలతో నిర్వాసితులు రోడ్డుపై పడ్డారని విమర్శ

నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియకుండానే మాజీ సీఎం కేసీఆర్ చర్లగూడెం ప్రాజెక్టును ప్రారంభించారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లాలోని మర్రిగూడెం మండలం చర్లగూడెం ప్రాజెక్ట్‌ను సందర్శించారు... నిర్వాసితులను పరామర్శించారు... అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు.

ఈ ప్రాజెక్టును ప్రారంభించి పదేళ్లు పూర్తయిందన్నారు. అసలు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియకుండా ప్రారంభించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొందరపాటు చర్యలతో నిర్వాసితులు రోడ్డున పడ్డారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు వర్షం నీటితో నిండేది కాదని... ఒకవేళ పూర్తైనా నీళ్లు రావన్నారు.

Congress
BRS
Komatireddy Raj Gopal Reddy
  • Loading...

More Telugu News