Akkineni Nagarjuna: అందుకే ప్రభాస్ ను అభిమానిస్తాను: నాగార్జున

Nagarjuna opines on Kalki 2898 AD release trailer and Prabhas

  • ప్రభాస్ ప్రధాన పాత్రలో కల్కి 2898 ఏడీ
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ చిత్రం
  • జూన్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
  • ఇటీవల ఈ చిత్రం నుంచి రిలీజ్ ట్రైలర్

టాలీవుడ్ లో చాన్నాళ్ల తర్వాత మరో భారీ చిత్రం రిలీజవుతోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కల్కి 2898 ఏడీ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ ట్రైలర్ వచ్చింది. దీనిపై టాలీవుడ్ కింగ్ నాగార్జున స్పందించారు. 

"ఎంత అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించావ్ నాగీ (నాగ్ అశ్విన్). మహత్తరమైన మన భారతీయ కథలను వెండితెర పైకి తీసుకువస్తుండడం సంతోషం కలిగిస్తోంది. రిలీజ్ ట్రైలర్ చూసి అచ్చెరువొందాను. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహలాడుతున్నాను. అమితాబ్ బచ్చన్ ఇరగదీశారు... కమల్ హాసన్ అదరగొట్టేశారు. ప్రభాస్... ప్రయోగాలు చేసేందుకు నువ్వు ఏమాత్రం వెనుకాడవు... నీలో ఆ గుణాన్ని నేను అభిమానిస్తాను. ఇక నా ఫేవరెట్ ప్రొడ్యూసర్లు అశ్వినీదత్, స్వప్న, స్వీటీలకు ఆల్ ది బెస్ట్. మీ సత్తా నిరూపించుకున్నారు. చిత్ర బృందానికి దేవుడి ఆశీస్సులు ఉండాలని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను" అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

Akkineni Nagarjuna
Prabhas
Kalki 2898 AD
Nag Aswin
Tollywood
  • Loading...

More Telugu News