Singapore: కూతురికి కష్టాలు అంటే ఏంటో తెలియాలని సింగపూర్ నుంచి వచ్చేస్తున్న భారతీయ కుటుంబం

Indian Man decided to return to India with family because good life in Singapore

  • భారతీయ వ్యక్తి అనూహ్య నిర్ణయం
  • సింగపూర్‌లో ఉంటే తన కూతురు మృదువుగా పెరుగుతుందని భావిస్తోన్న వ్యక్తి
  • పాక్షికంగా బెంగళూరుకు మకాం మార్చాలని నిర్ణయం
  • ఎక్స్ వేదికగా ప్రకటన.. నెటిజన్ల ఆసక్తికర చర్చ

ఎలాంటి ఇబ్బంది లేకుండా సింగపూర్‌లో హాయిగా నివసిస్తున్న తన కుటుంబాన్ని భారత్‌కు షిఫ్ట్ చేయాలని ఓ భారతీయుడు నిర్ణయించుకున్నాడు. తన భార్య, కుమార్తెతో కలిసి బెంగళూరుకు మకాం మార్చేందుకు సిద్ధమయ్యాడు. ‘రియల్‌ఫాస్ట్’ అనే కంపెనీకి సహ-వ్యవస్థాపకుడిగా ఉన్న ఆకాశ్ ధర్మాధికారి అనే వ్యక్తి తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కుటుంబాన్ని భారత్‌కు తరలించడం వెనుక ఆయన చెబుతున్న కారణమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది.

సింగపూర్‌లో తన కుటుంబం చక్కటి జీవితం గడుపుతుండడమే తన నిర్ణయానికి కారణమని ఆకాశ్ చెప్పారు. జీవితంలో కష్టాలు, అనిశ్చిత పరిస్థితులు అంటే ఏంటో తన కూతురికి తెలియజేయాలని తాను, తన భార్య నిర్ణయించుకున్నామని, అందుకే భారత్‌కు మకాం మార్చాలని నిర్ణయించుకున్నామని వివరించారు. అనిశ్చిత పరిస్థితులకు ఆమెను అలవాటు చేయాలని భావిస్తున్నామని, సింగపూర్‌లో నివసిస్తున్న ఆమెకు ఇబ్బందుల గురించి కనీస అవగాహన లేదని పేర్కొన్నారు. ‘‘మా కూతురికి జీవితంలో అనిశ్చిత పరిస్థితులను అలవాటు చేయడానికి పాక్షికంగా బెంగళూరుకు షిఫ్ట్ అవుతున్నాం. సింగపూర్ చాలా పరిపూర్ణంగా ఉంటుంది. అక్కడి పరిస్థితులు ఆమెను మృదువుగా తయారు చేస్తాయని మేము భావిస్తున్నాం. దురదృష్టం ఏమిటంటే సింగపూర్ వెళ్లాక మేము కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎలా ఉంటాయో మరచిపోయాం. సున్నిత వ్యక్తులుగా మారిపోయాం’’ అంటూ ఆకాశ్ ధర్మాధికారి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

‘‘నేను బెంగళూరులో నివసించినప్పుడు చూసిన అసాధారణ పరిస్థితులు, మమకారంతో కూడిన సంభాషణలను కోల్పోయాను. గత దశాబ్ద కాలంలో సింగపూర్‌లో నేను కోల్పోయిన వ్యక్తులతో మళ్లీ ఇక్కడ పనిచేయాలని నిర్ణయించుకున్నాను’’ అంటూ ఆకాశ్ పేర్కొన్నారు. దీంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆకాశ్ నిర్ణయానికి కొందరు వ్యక్తులు మద్దతు తెలపగా.. మరికొందరు వ్యక్తులు మీ నిర్ణయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలంటూ హెచ్చరించారు.

ఇండియాలోని ఇతర నగరాలతో పోల్చితే బెంగళూరులో జీవితం చాలా కఠినంగా ఉంటుందని, ట్రాఫిక్ కష్టాలు ఒక రేంజ్‌లో ఉంటాయంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. దీనికి ఆకాశ్ స్పందిస్తూ.. ఈ అంశంపై తాను వాదనకు దిగబోనని, అయితే బెంగళూరులో తనకు స్నేహితులు ఉండడంతో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు.

Singapore
Indian Family
Indian Man
Off beat News
Viral News
  • Loading...

More Telugu News