Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు!

Police Case on YCP Leader Kodali Nani in Gudivada
  • కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు మాజీ వాలంటీర్ల ఫిర్యాదు
  • వారి ఫిర్యాదుతో వైసీపీ నేత‌పై కేసు నమోదు చేసిన గుడివాడ పోలీసులు 
  • నానితో పాటు దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను, మ‌రో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల‌పై కేసు న‌మోదు
ఎన్నికలకు ముందు పలువురు వార్డు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత‌ కొడాలి నానికి గ‌ట్టి షాక్ త‌గిలింది. మాజీ వార్డు వాలంటీర్లు ఆయ‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన‌ట్లు తెలుస్తోంది.
Kodali Nani
YSRCP
Andhra Pradesh
Police Case

More Telugu News