Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు సాయిధరమ్ తేజ్

Hero Saidharam Tej Gives Special Gift to Deputy CM Pawan Kalyan
  • పవన్‌కు స్టార్ వార్స్ అండ్ లెగో కిట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన మెగా మేనల్లుడు
  • పవన్‌లోని పిల్లాడికి ఈ బహుమతి అన్న సాయిధరమ్ తేజ్
  • ఇటీవలే పవన్‌కు పెన్నుని బహుమతిగా ఇచ్చిన చిరంజీవి దంపతులు
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యులు ఆయన్ను అభినందిస్తున్నారు. బహుమతులతో ముంచెత్తుతున్నారు. ఇటీవలే అన్నావదినలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ ప్రత్యేక పెన్నును బహుమతిగా అందజేశారు. తాజాగా డిప్యూటీ సీఎం మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా స్పెషల్ గిఫ్ట్‌ను అందజేశారు. ‘స్టార్ వార్స్ అండ్ లెగో’ కిట్‌ను బహుమతిగా అందజేశారు. 

‘‘స్టార్ వార్స్, లెగోలను నాకు పరిచయం చేసిన వ్యక్తి, నా ప్రియమైన జేడీ మాస్టర్ (స్టార్ వార్ కల్పిత పాత్ర), డిప్యూటీ సీఎంకు ఎట్టకేలకు ఒక బహుమతి ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ ఆయనలోని పిల్లాడికి మేనల్లుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఫోర్స్ కూడా మాతోనే ఉంటారు’’ అని ఎక్స్‌లో సాయిధరమ్ తేజ్ రాసుకొచ్చాడు.
Pawan Kalyan
Saidharam Tej
Janasena
Andhra Pradesh
Tollywood
Movie News

More Telugu News