Sai Dharam Tej: ప‌వ‌న్ కోసం కాలినడకన తిరుమలకు వెళ్లిన మెగా మేన‌ల్లుడు!

Sai Dharam Tej Went To Tirumala On Foot After Pawan Kalyan Won

  • పవన్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని సాయి దుర్గా తేజ్ మొక్కు 
  • ఏపీ సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో జనసేనాని ఘ‌న విజ‌యం
  • కోరిక తీరడంతో అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి మెగా మేన‌ల్లుడు 

ఏపీ సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. జన‌సేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంట్ స్థానాల్లోనూ విజ‌య‌ఢంకా మోగించింది. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీచేయ‌గా.. ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి దేశంలోనే సంచలనం రేపింది. 

ఇక ప‌వ‌న్‌ పిఠాపురం నుంచి పోటీచేసి ఘ‌న విజ‌యం సాధించారు. 70 వేల‌కు పైగా మెజారిటీతో బంప‌ర్ విక్ట‌రీ సాధించారు. తాజాగా ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. 

అయితే, పవ‌న్ క‌ల్యాణ్ ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో ఆయన మేన‌ల్లుడు, సినీ న‌టుడు సాయి దుర్గా తేజ్ తిరుమలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. పవన్ కల్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని సాయి తేజ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. పవన్ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డంతో, చెప్పిన‌ట్లుగానే సాయితేజ్ కాలినడకన తిరుమలకు వెళ్లారు. అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెళ్లారు. అలిపిరి నుంచి సాయి తేజ్ తిరుమ‌ల‌కు వెళుతున్న వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Sai Dharam Tej
Tirumala
Pawan Kalyan
AP Elections 2024
TTD
Andhra Pradesh
Janasena
  • Loading...

More Telugu News