Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు

Court denies bail to Phone Tapping case accused

  • భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన నాంపల్లి కోర్టు
  • బెయిల్ పిటిషన్లపై నిన్ననే ముగిసిన వాదనలు
  • నేడు పిటిషన్లు కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు  

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వారి బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. తమను రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేశారని, తమపై ఎలాంటి సాక్ష్యాలు లేవని పిటిషనర్లు భుజంగరావు, తిరుపతన్నల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

అయితే, ఛార్జిషీట్ దాఖలు చేశామని, మరింత విచారించాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. కాబట్టి వారికి బెయిల్ ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ బెయిల్ పిటిషన్లపై మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. నాంపల్లి కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఈరోజు న్యాయమూర్తి వారి పిటిషన్లను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Phone Tapping Case
Telangana
  • Loading...

More Telugu News