Narendra Modi: ఏపీని నవశకం దిశగా నడిపించేందుకు సంపూర్ణంగా కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ

PM Modi tweets after attending AP Govt swearing in ceremony

  • ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం
  • నేడు గన్నవరం వద్ద ప్రమాణ స్వీకారోత్సవం
  • హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
  • నూతన ప్రభుత్వానికి ఆశీస్సుల అందజేత

అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేడు లాంఛనంగా కొలువుదీరింది. ఇవాళ గన్నవరం వద్ద జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా... పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ఏపీ నూతన ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేశారు. అనంతరం మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. 

"ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యాను. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు, మంత్రులుగా ప్రమాణం చేసిన ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు, మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంది. యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేర్చుతుంది" అని స్పష్టం చేశారు.

Narendra Modi
AP Govt
TDP-JanaSena-BJP Alliance
NDA
Andhra Pradesh
  • Loading...

More Telugu News