Bill Gates: ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన బిల్ గేట్స్

Bill Gates congratulates PM Modi on his consecutive third term

  • భారత సార్వత్రిక ఎన్నికలపై ఆసక్తి కనబర్చిన యావత్ ప్రపంచం
  • ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి
  • వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ
  • పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మోదీ

భారత ప్రధానిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి మైక్రోసాఫ్ట్ సంస్థ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ శుభాకాంక్షలు తెలిపారు. 

"వరుసగా మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు అందుకున్న నరేంద్ర మోదీకి శుభాభినందనలు. ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా ఆధారిత అభివృద్ధి, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ తదితర రంగాల్లో అంతర్జాతీయ ఆవిష్కరణలకు వనరుగా భారత్ స్థానాన్ని బలోపేతం చేశారు. భారత్ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం కోసం మన భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నాను" అంటూ బిల్ గేట్స్ పేర్కొన్నారు.

Bill Gates
Narendra Modi
Prime Minister
NDA
India
Microsoft
USA
  • Loading...

More Telugu News