Actor Suman: ఏపీలో కూట‌మి విజ‌యంపై సినీ న‌టుడు సుమ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

Actor Suman Interesting Comments on TDP Alliance Victory in AP
  • కూట‌మి విజ‌యం కోసం ప‌వ‌న్ చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని సుమన్ కితాబు 
  • ఏపీలో వెనుక‌బ‌డ్డ‌ సినీ ఇండ‌స్ట్రీపై ప‌వ‌న్‌, చంద్ర‌బాబు ఫోక‌స్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి
  • అమరావ‌తిని అమెరికాలా చేయాలంటే కేవ‌లం చంద్ర‌బాబుతోనే సాధ్య‌మ‌న్న సుమన్‌ 
ఏపీలో టీడీపీ కూట‌మి అఖండ విజ‌యంపై నటుడు సుమ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించారు. రాష్ట్ర ప్ర‌జ‌లు స్వ‌చ్ఛంగా తీర్పు ఇచ్చార‌ని చెప్పిన సుమన్‌.. ఈ గెలుపు ఎవ‌రూ ఊహించ‌లేద‌న్నారు. కూట‌మి విజ‌యం కోసం ప‌వ‌న్ చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని తెలిపారు. 

ఏపీలో సినీ ఇండ‌స్ట్రీ బాగా వెనుక‌ప‌డిపోయింద‌ని, షూటింగ్స్ పెరిగేందుకు కావాల్సిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఫోక‌స్ చేయాల‌ని ఆయ‌న సూచించారు. ఇక అమరావ‌తిని అమెరికాలా చేయాలంటే అది కేవ‌లం చంద్ర‌బాబుతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని పేర్కొన్నారు. 

హైద‌రాబాద్ ఆర్కిటెక్చ‌ర్ కూడా బాబుగారేన‌ని సుమ‌న్ అభివ‌ర్ణించారు. నిర్మించేవాళ్లు ఒక్క‌రే ఉంటార‌ని, కానీ విధ్వంసం చేసేవాళ్లు చాలా మంది ఉంటార‌న్నారు. చంద్ర‌బాబుకు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పిలుపునిచ్చారు. ఇక బీజేపీ కూడా ఏపీలో బాగానే పుంజుకుంద‌న్నారు. దేశాభివృద్ధికి ప్ర‌జ‌లు ప్ర‌ధాని మోదీకి స‌హ‌క‌రించాల‌న్నారు.
Actor Suman
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
Chandrababu
Pawan Kalyan

More Telugu News