Heart attack: గుండెపోటుతో వ్యక్తి మృతి.. సీసీటీవీలో రికార్డ‌యిన దృశ్యాలు!

Man Dead with Heart attack who work in Medplus Pharmacy in Medchal Video goes Viral
  • మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో ఘ‌ట‌న‌
  • మెడ్‌ప్ల‌స్ ఫార్మసీలో పని చేస్తున్న మురళికి గుండెపోటు
  • ఒక్క‌సారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి
ఇటీవ‌ల గుండెపోటు కార‌ణంగా హ‌ఠాన్మ‌ర‌ణాలు పెరుగుతున్నాయి. అప్ప‌టివ‌ర‌కు ఎంతో హుషారుగా ఉన్న వ్య‌క్తులు ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోతున్నారు. చుట్టుప‌క్క‌ల వారు ఏం జ‌రిగిందో తెలుసుకునేలోపు ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా హైదరాబాద్ న‌గ‌ర ప‌రిధిలో ఇదే కోవ‌కు చెందిన ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న తాలూకు దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్తా బయ‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది.  

ఈ ఘ‌ట‌న‌ మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న మెడ్‌ప్ల‌స్ ఫార్మసీలో పని చేస్తున్న మురళి గుండెపోటుతో మ‌ర‌ణించాడు. షాపున‌కు వచ్చిన క‌స్ట‌మ‌ర్ల‌కు మందులు ఇచ్చి.. బిల్లింగ్ చేస్తున్న సమయంలో ముర‌ళికి ఒక్కసారిగా గుండెపోటు వ‌చ్చింది. దాంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందాడు.
Heart attack
Hyderabad
Medchal
Medplus Pharmacy
Telangana

More Telugu News