Hema: సినీ నటి హేమ కోసం హైదరాబాద్‌కు చేరుకున్న బెంగళూరు పోలీసులు

Bengaluru CCB police reached Hyderabad to arrest Hema
  • హేమను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన సీసీబీ పోలీసులు
  • మే 20న రేవ్ పార్టీలో పాల్గొన్న సినీ నటి హేమ
  • ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసిన బెంగళూరు పోలీసులు
సినీ నటి హేమ కోసం బెంగళూరు సీసీబీ పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. సీసీబీ పోలీసులు ఆమెకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకోవడానికి సీసీబీ పోలీసులు ఈరోజు హైదరాబాద్ వచ్చారు.

నటి హేమ మే 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారు. ఆమె రక్తనమూనాలో డ్రగ్స్ పాజిటివ్‌ను గుర్తించారు. దీంతో విచారణకు రావాలని హేమతో పాటు... రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురికి నోటీసులు ఇచ్చారు. మొదటిసారి గత సోమవారం విచారణకు హాజరు కావాలని, రెండోసారి జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆమె సీసీబీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు.
Hema
Tollywood
Bengaluru
Police
Hyderabad

More Telugu News