CBI: సీబీఐ కేసులోనూ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

Kavitha Judicial custoday extended till June 7

  • సీబీఐ కేసులో జూన్ 7వ తేదీ వరకు కవిత రిమాండ్ పొడిగింపు
  • మద్యం పాలసీ కేసులో అదేరోజున ఛార్జిషీట్ దాఖలు చేయనున్న సీబీఐ
  • మద్యం పాలసీలో కవిత పాత్రపై ఇటీవలే సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ

ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 7వ తేదీ వరకు పొడిగించింది. అంతకుముందు, ఈడీ కేసులో కవిత కస్టడీని వచ్చే నెల 3 వరకు పొడిగించిన న్యాయస్థానం... ఆ తర్వాత సీబీఐ కేసులోనూ ఈ శుక్రవారం వరకు పొడిగించింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ జూన్ 7న కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. మద్యం కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

CBI
K Kavitha
Delhi Liquor Scam
Telangana
  • Loading...

More Telugu News