S Radha Krishna: టాలీవుడ్ నిర్మాత ఎస్.రాధాకృష్ణకు మాతృవియోగం

Tollywood producer S Radha Krishna mother passed away

  • హృదయ సంబంధ వ్యాధితో కన్నుమూసిన నాగేంద్రమ్మ
  • ఈ మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచిందన్న కుటుంబ సభ్యులు
  • రేపు ఫిలింనగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు)కు మాతృవియోగం కలిగింది. రాధాకృష్ణ తల్లి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) కన్నుమూశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె హృదయ సంబంధ వ్యాధితో మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

నాగేంద్రమ్మ అంత్యక్రియలు రేపు (మే 31) హైదరాబాదు ఫిలింనగర్ విద్యుత్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. నాగేంద్రమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమెకు రాధాకృష్ణ రెండో కుమారుడు.

S Radha Krishna
Mother
Nagendramma
Demise
Producer
Tollywood
  • Loading...

More Telugu News