Multiplex Association of India: సినీప్రియులకు బంపర్ ఆఫర్.. 31న దేశవ్యాప్తంగా రూ. 99కే సినిమా టికెట్!

Cinema Lovers Day Catch New Releases For 99 On May 31st In India
  • తెలుగు, హిందీ సహా ఏ భాషలోనైనా, ఏ షోకైనా ఆ రోజు అదే ధర
  • సినిమా లవర్స్ డే సందర్భంగా ప్రకటించిన మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
  • పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ లాంటి చైన్లతోపాటు 4 వేలకుపైగా స్క్రీన్లకు వర్తింపు
సినీప్రియులకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 31న సినిమా లవర్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఏ భాష సినిమా అయినా, ఏ షో అయినా ప్రేక్షకులు రూ. 99 టికెట్ కే చూడొచ్చని వెల్లడించింది. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ లాంటి చైన్లతోపాటు దేశంలో 4 వేలకుపైగా ఉన్న స్క్రీన్లలో ఇదే టికెట్ ధర ఆ రోజు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లవైపు రప్పించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా ఓవైపు ఎన్నికల హడావిడి, మరోవైపు ఐపీఎల్ ఫీవర్ కారణంగా ఈ సమ్మర్ లో టాలీవుడ్, బాలీవుడ్ సహా ఎక్కడా పెద్ద హీరోల సినిమాలేవీ విడుదల కాలేదు. విడుదలైన చిన్న సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. హాలీవుడ్ సినిమాలు కూడా పరిమితంగానే విడుదల కావడంతో టికెట్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ టికెట్లపై డిస్కౌంట్ ప్రకటించింది.

బుక్ మై షో, పేటీఎం, అమెజాన్ పే లాంటి ఆన్ లైన్ వేదికల ద్వారా ఈ నెల 31న సినిమా టికెట్లు బుక్ చేసుకొనే వారు రూ. 99తోపాటు జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నేరుగా థియేటర్ లోని కౌంటర్ లో టికెట్ కొంటే మాత్రం జీఎస్టీ, ఇతర చార్జీలు ఉండవు. అయితే ఐమ్యాక్స్, రిక్లైనర్ సీట్లకు మాత్రం రూ. 99 టికెట్ ధర వర్తించదు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఛోటా భీమ్ అండ్ ద కర్స్ ఆఫ్ డమ్ యాన్, హైక్యూ ద డంప్ స్టర్ బ్యాటిల్ లాంటి సినిమాలు ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
Multiplex Association of India
Movies
Ticket Price
Discount
Cinema Lovers Day
PVR
INOX
Cinepolis
Rs.99

More Telugu News