Snake Hatchlings: బాత్రూంలో 30 పాము పిల్లలు... హడలిపోయిన ఇంటి యజమానులు

Thirty snake hatchlings spotted in bathroom
షార్ట్స్‌లో చూడండి
ఒక పామును చూస్తే వామ్మో అని భయపడుతుంటారు. ఇక ఒకే చోట 30 పాము పిల్లలు కనిపిస్తే ఇంకేమైనా ఉందా? అసోంలోని నాగావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కలియాబోర్ ప్రాంతంలోని ఓ ఇంటి బాత్రూం నుంచి పాము పిల్లలు బయటికి వస్తుండడాన్ని గమనించిన ఆ ఇంటి వారు హడలిపోయాడు.

ఇరుగుపొరుగు వారికి కూడా ఈ విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం స్థానిక స్నేక్ క్యాచర్ సంజీబ్ దేకాకు సమాచారం అందిచడంతో, అతడు వెంటనే అక్కడికి చేరుకుని ఆ బాత్రూం నుంచి పాము పిల్లలన్నింటినీ బయటికి తీసుకువచ్చాడు. వాటిని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. 

కాగా, అవి విష సర్పాలు కాదని, సాధారణ నీటి పాములు గుర్తించారు.
Go Back to Shorts
Snake Hatchlings
Bathroom
Nagaon
Assam
Viral Videos

More Telugu News