Kejriwal Bail: మరో వారం రోజులు బెయిల్ పొడిగించండి.. సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ విజ్ఞప్తి

Arvind Kejriwal Requests Supreme Court To Extend Interim Bail By 7 Days

  • సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం
  • అనారోగ్య సమస్యల నేపథ్యంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థన
  • బెయిల్ ఇవ్వడంపైనే బీజేపీ ఆరోపణలు

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో తనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మరో వారం రోజుల పాటు బెయిల్ పొడిగించాలని పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో కొన్ని కీలక వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. జైలులో ఉన్న కాలంలో ఏడు కిలోల బరువు తగ్గడం, కీటోన్స్ పెరగడం వంటి అనారోగ్య సమస్యలకు సరైన చికిత్స తీసుకోవాల్సి ఉందని, ఇందుకోసం పెట్ స్కాన్ వంటి కీలక టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచించారని చెప్పారు. ఈ క్రమంలోనే తన బెయిల్ గడువును 7 రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ కోర్టును అభ్యర్థించారు.

లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓ పార్టీ అధ్యక్షుడిగా ప్రచారం నిర్వహించుకోవడానికి సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. అయితే, బెయిల్ మంజూరు విషయంలో కేజ్రీవాల్ ను స్పెషల్ గా ట్రీట్ చేసిందంటూ బీజేపీ వర్గాలు సుప్రీంకోర్టు తీర్పును ఆక్షేపించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. కేజ్రీవాల్ విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లుందని పరోక్షంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా బెయిల్ పొడిగించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందించనుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Kejriwal Bail
Supreme Court
Bail Extention
Kejriwal Plea
AAP Chief
kejriwal Health
  • Loading...

More Telugu News