Janhvi Kapoor: శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ క్రికెట్ శిక్షణ చూశారా? ఇదిగో వీడియో

Janhvi Kapoor Reveals What Went Into The Making Of Mr Mrs Mahi 150 Days Of Training 2 Injuries And More
  • మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో మహిమ పాత్ర కోసమే..
  • తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో స్వయంగా శిక్షణ వీడియో పోస్ట్ చేసిన గ్లామర్ క్వీన్
  • దేశవ్యాప్తంగా ఈ నెల 31న విడుదల కానున్న సినిమా
దివంగత అందాల నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ క్రికెట్ బ్యాట్ పట్టింది. షాట్లు ఎలా ఆడాలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసింది. ఆ.. ఇందులో ఏముందిలే.. ఏదో సరదాగా ఆడిందనుకుంటున్నారా? తన తాజా చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహీలో పోషించిన పాత్ర కోసం ఆమె ఎంతగానో క్రికెట్ సాధన చేసింది. గాయాలపాలైనా లెక్కచేయకుండా శిక్షణ తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ‘150కిపైగా రోజుల శిక్షణ, 30 రోజులకుపైగా షూటింగ్, రెండు గాయాలు, ఒక చిత్రం’ అంటూ  ఆ వీడియోలో క్యాప్షన్ పెట్టింది. మే 31న థియేటర్లలో మిస్టర్ అండ్ మిసెస్ మహీ విడుదలవుతోందంటూ జాన్వీ తెలిపింది.

ఆ వీడియోలో జాన్వీ కపూర్ నెట్స్ లో ముమ్మర ప్రాక్టీస్ చేయడం కనిపించింది. ఈ వీడియోను చూసిన ఆమె బాయ్ ఫ్రెండ్ షికర్ పహారియా సైతం ఇన్ స్టా వేదికగా స్పందించాడు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అంటూ కామెంట్ చేశాడు.  జాన్వీ ఫిట్ నెస్ కోచ్ నమ్రతా పురోహిత్ స్పందిస్తూ ‘ఈ సినిమా కోసం నువ్వు ఎంతగా కష్టపడ్డావో తెలుసు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ పేర్కొంది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు సరసన జాన్వీ నటించింది. ఇందులో మహిమ పాత్ర పోషించింది.

మరోవైపు ఈ చిత్ర బృందం ఇటీవలే యూట్యూబ్ లో ఓ బీటీఎస్ వీడియోను షేర్ చేసింది. జాన్వీ కపూర్ కు క్రికెట్ శిక్షణ సందర్భంగా ఎదురైన సవాళ్ల గురించి ఈ చిత్ర దర్శకుడు శరణ్ శర్మ వివరించాడు. అలాగే జాన్వీ క్రికెట్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా తన అనుభవాలను పంచుకున్నాడు. బరోడా క్యాంప్ లో జాన్వీ శిక్షణ పొందినట్లు వివరించాడు. ఐపీఎల్ కు సిద్ధమయ్యే క్రికెటర్లు ఏ స్థాయిలో శిక్షణ పొందుతారో జాన్వీ కపూర్ సైతం అంతలా కఠోర సాధన చేసిందని ప్రశంసించాడు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.


Janhvi Kapoor
Mr and Mrs Mahi
Bollywood
Movie
Promotion
Video

More Telugu News