Realme 12 Pro plus: రియల్‌మీ 12 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్

huge discount available on Realme 12 Pro plus smartphone
  • ఫ్లిప్‌కార్ట్‌పై రూ.3 వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్లు
  • ఫోన్ ఎక్స్చేంజ్‌పై రూ.6 వేల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం
  • తక్కువ ధరకే లభిస్తున్న మూడు వేరియెంట్ల ఫోన్లు

ఈ ఏడాది ఆరంభంలో అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌లో విడుదలైన రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌‌పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మూడు స్టోరేజీ వేరియంట్‌లు 8జీబీ ర్యామ్+128జీబీ/256జీబీ, 12జీబీ ర్యామ్+256జీబీలలో ఈ ఫోన్ లభిస్తుండగా.. బేస్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. ఇతర రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.31,999, రూ.33,999గా ఉన్నాయి. ఈ ఫోన్ల కొనుగోలుపై రూ.3,000 వరకు బ్యాంక్ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో బేస్ వేరియెంట్ ఫోన్‌ను రూ.26,999కే దక్కించుకోవచ్చు. అంతేకాదు అదనంగా రూ. 3,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా రూ.6,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

రియల్‌మీ ప్రో ప్లస్ ఫీచర్లు ఇవే..
రియల్‌మీ 12 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ 1 క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ప్రాసెసర్, 67వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 20హెట్జ్ అధిక రిఫ్రెష్ రేట్‌, 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ, 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0పై ఈ ఫోన్ పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 120రెట్ల సూపర్‌జూమ్ ఫీచర్‌తో 64ఎంపీ టెలిఫోటో కెమెరా ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. 12జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News