నేను జైలు నుంచి పోటీ చేస్తే 70 స్థానాలకు 70 గెలుచుకుంటాం: అరవింద్ కేజ్రీవాల్
- అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య సునీతా కేజ్రీవాల్ పోటీ చేయదని స్పష్టీకరణ
- ఢిల్లీ ప్రజలు అమాయకులు కాదు... అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్య
- తనను ఢిల్లీలో ఓడించలేకే మద్యం పాలసీ కేసులో ఇరికించారని ఆరోపణ
ఢిల్లీలో తనను ఓడించలేనని తెలిసే ప్రధాని మోదీ ఢిల్లీ మద్యం కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ కేసులో ఇరికించి తాను ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని చూస్తున్నారన్నారు. తనకు అధికార యావ లేదని... కానీ తాను రాజీనామా చేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. తనను ఎంతకాలం జైల్లో ఉంచుతారనే దానికి ప్రధాని మోదీ మాత్రమే సమాధానం చెప్పగలరని ఎద్దేవా చేశారు. తాను సీఎం పదవికి రాజీనామా చేస్తే కనుక ఆ తర్వాత మిగిలిన ప్రతిపక్ష ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తారన్నారు.