SRH: ఐపీఎల్ క్వాలిఫయర్-1... టాస్ గెలిచిన సన్ రైజర్స్

SRH won the toss in qualifier 1
  • ఐపీఎల్ లో నేటి నుంచి ప్లేఆఫ్స్
  • తొలి క్వాలిఫయర్ లో సన్ రైజర్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్

ఐపీఎల్ లో ఒక అంకం ముగిసింది. నేటి నుంచి ప్లేఆఫ్స్ షురూ అవుతున్నాయి. ఇవాళ ఐపీఎల్ క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుండగా... పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో ప్రవేశిస్తుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. 

ఇక, నేటి క్వాలిఫయర్-1 మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రతి మ్యాచ్ లో దాదాపు సన్ రైజర్స్ పరుగుల వరద పారించింది. ఇవాళ కూడా టాస్ గెలిచిన వెంటనే ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ మరేమీ ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అటు, కోల్ కతా జట్టు కూడా ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది.

సన్ రైజర్స్ హైదరాబాద్...
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియస్కాంత్, టి.నటరాజన్.

కోల్ కతా నైట్ రైడర్స్...
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్ దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్  రాణా, వరుణ్ చక్రవర్తి.

  • Loading...

More Telugu News