HIV Positive: హెచ్ఐవీ బాధితురాలి నిర్వాకంతో రిస్క్ లో 200 మంది ప్రాణాలు

American sex worker engages with over 200 clients despite knowing she is HIV positive

  • సెక్స్ వర్కర్ ను అరెస్టు చేసిన ఓహియో పోలీసులు
  • హెల్త్ అలర్ట్ జారీ చేసి, బాధితులకు ఫోన్ కాల్స్
  • ఆమెతో సన్నిహితంగా గడిపిన వారు టెస్టులు చేయించుకోవాలని సూచన

ఆమెకు ప్రాణాంతకమైన వ్యాధి సోకిందని వైద్య పరీక్షల్లో బయటపడింది.. తన ద్వారా మిగతా వారికి అంటుతుందని తెలిసీ ఓ మహిళ ఏకంగా 200 మందికి పైగా పురుషులతో శృంగారం చేసింది. 2022 నుంచి విటులతో గడుపుతూ వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టిన సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులను అప్రమత్తం చేయడానికి హెల్త్ అలర్ట్ ప్రకటించారు. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. విషయం బయటపడడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఓహియోలోని మరియెట్టాకు చెందిన లిండా లెచెసే అనే సెక్స్ వర్కర్ కు 2022 లో హెచ్ఐవీ సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్ రావడంతో తన పనికి స్వస్తి పలకాల్సిన లిండా అలా చేయలేదు. మరింత మందితో శృంగారంలో పాల్గొంటూ వచ్చింది. 2022 నుంచి ఇప్పటి వరకు 211 మందితో సన్నిహితంగా గడిపినట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలింది. దీంతో లిండాను అరెస్టు చేసిన పోలీసులు.. ఆమె కస్టమర్లు 211 మందికి ఫోన్ చేసి విషయం చెప్పారు.

వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతోపాటు తమ దృష్టికి రాని కస్టమర్లు ఇంకా ఎవరైనా ఉంటే చెప్పాలని అడుగుతున్నారు. లిండాకు హెచ్ఐవీ ఉందని బయటపడడంతో గతంలో ఆమెతో గడిపిన వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.

HIV Positive
American sex worker
200 clients
Ohio State
America
Health Alert
  • Loading...

More Telugu News