RCB: సరైన సమయంలో చెలరేగిన ఆర్సీబీ టాపార్డర్... సీఎస్కే ముందు 219 పరుగుల టార్గెట్

RCB set CSK 219 runs target

  • ఫ్లేఆఫ్స్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ తో ఆర్సీబీ రసవత్తర పోరు
  • ఈ మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో గెలిస్తేనే  ఆర్సీబీకి ప్లేఆఫ్ బెర్తు
  • సీఎస్కేను 200 లోపు స్కోరుకే కట్టడి చేసేందుకు ఆర్సీబీ వ్యూహరచన

ప్లేఆఫ్స్ చేరాలంటే చెన్నై సూపర్ కింగ్స్ పై 18 పరుగుల తేడాతో గెలవాలన్న సమీకరణం నేపథ్యంలో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాపార్డర్ జూలు విదిల్చింది. సీఎస్కే జట్టుతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 

విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, పాటిదార్, కామెరాన్ గ్రీన్.. ఇలా టాపార్డర్ లో అందరూ రాణించిన వేళ... ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 

కోహ్లీ, డుప్లెసిస్ జోడీ తొలి వికెట్ కు 78 పరుగులు జోడించి శుభారంభం అందించారు. కోహ్లీ 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 47 పరుగులు చేయగా... కెప్టెన్ డుప్లెసిస్ 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేశాడు. రజత్ పాటిదార్ చిచ్చరపిడుగులా ఆడి 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 41 పరుగులు చేశాడు. 

గత మ్యాచ్ ల్లో ఏమంత ఆకట్టుకోని కామెరాన్ గ్రీన్ ఈ మ్యాచ్ లో భారీ షాట్లతో అలరించాడు. గ్రీన్ 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సుతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దినేశ్ కార్తీక్ 6 బంతుల్లో 14, లోమ్రోర్ 5 బంతుల్లో 16 పరుగులు చేశారు. 

చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, తుషార్ దేశ్ పాండే 1, మిచెల్ శాంట్నర్ 1 వికెట్ తీశారు. 

ఇక, ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే చెన్నై జట్టును 200 లోపు స్కోరుకే పరిమితం చేయాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News