Jagan: ఈ రాత్రి విజయవాడ నుంచి లండన్ కు బయల్దేరుతున్న జగన్

Jagan leaving to London tonight
  • రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్ కు పయనం
  • ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లలో కూడా పర్యటించనున్న సీఎం
  • ఈ నెల 31న విదేశాల నుంచి తిరిగిరానున్న ముఖ్యమంత్రి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రాత్రి లండన్ కు బయల్దేరుతున్నారు. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల బిజీలో ఉన్న జగన్ విశ్రాంతి కోసం తన భార్య భారతితో కలిసి విదేశాలకు వెళ్తున్నారు. ఈ రాత్రి 11 గంటలకు ఆయన విజయవాడ నుంచి లండన్ కు పయనమవుతున్నారు. జగన్ కుమార్తెలు లండన్ లో ఉంటున్నారు. లండన్ తో పాటు స్విట్జర్లాంట్ లో కూడా ఆయన పర్యటించనున్నారు.  ఈ నెల 31న ఆయన విదేశాల నుంచి తిరిగొస్తారు. 

విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని కోర్టును కోరారు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనే బెయిల్ కండిషన్ నేపథ్యంలో... ఆ షరతులను సడలించాలని కోర్టును జగన్ కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటించేందుకు అనుమతిని ఇవ్వాలని విన్నవించారు. జగన్ పర్యటనకు సీబీఐ అభ్యంతరం తెలిపింది. అయితే, జగన్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు... విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది. 

Jagan
YSRCP

More Telugu News