Double iSmart: రామ్‌-పూరీ కాంబోలో ‘డ‌బుల్ ఇస్మార్ట్’.. టీజ‌ర్ విడుదల!

Double iSmart Teaser Out Now
  • రామ్ పోతినేని బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘డ‌బుల్ ఇస్మార్ట్’ టీజ‌ర్ విడుద‌ల‌ 
  • మ‌రోసారి త‌న ఎనర్జిటిక్ ప‌ర్ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్న యంగ్ హీరో
  • ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా వ‌స్తున్న ‘డ‌బుల్ ఇస్మార్ట్’ పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు

టాలీవుడ్ యువ న‌టుడు రామ్‌ పోతినేని, డాషింగ్ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ కాంబోలో వ‌స్తున్న ‘డ‌బుల్ ఇస్మార్ట్’ టీజ‌ర్ విడుద‌ల‌యింది. రామ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్రం యూనిట్ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. 85 నిమిషాల నిడివితో ఉన్న టీజ‌ర్‌లో పూరీ త‌న మార్క్ చూపించాడు. అలాగే రామ్ మ‌రోసారి త‌న ఎనర్జిటిక్ ప‌ర్ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ ఇస్మార్ట్ అంటూ రామ్ మాస్ ఎంట్రీతో గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. 

ఇక స్టోరీ రివీల్ చేయ‌కుండా మ‌రోసారి ఇస్మార్ట్ శంక‌ర్ రోల్‌లో ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించాడు రామ్. ఈ చిత్రంలో విల‌న్ న‌టిస్తున్న‌ సంజయ్ దత్ పాత్రను కూడా ప‌రిచ‌యం చేశారు. ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఉన్నాయి. 

ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలో జ‌రుగుతోంది. పూరీ ముంబైలో డబుల్‌ ఇస్మార్ట్‌ క్లైమాక్స్ ఫైట్ సీన్‌ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఫైటింగ్ సీక్వెన్స్‌ కోసం ఏకంగా రూ.7 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడని స‌మాచారం. ఇక మూవీలో ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో అలీ, కావ్య థాపర్‌, షియాజీ షిండే, ఉత్తేజ్, గెటప్ శీను త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=tq2HmozH_5Y

  • Loading...

More Telugu News